Traffic Rules: అత్తారింటికీ దారేది మీమ్స్‌తో వాహా‌న‌దారుల‌కు ట్రాఫిక్ పోలీసులు అవ‌గాహ‌న‌..

Traffic Rules: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాన్ న‌టించిన అత్తారింటికి దారేది చిత్రంలో క్లైమాక్స్ సీన్ గుర్తుంది క‌దా.. అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు.. ప‌వ‌న్ క‌ల్యాన్ త‌న అత్త న‌దియాతో మాట్లాడే సీన్ పిక్‌ను జ‌త చేసి.. నువ్వేమో 1300 సేవ్ చేద్దామ‌ని కాలు అడ్డుగా పెట్టావు. కానీ నాకు పోలీసులు ఇంకో రూ.1500 అద‌నంగా ఫైన్ వేశారు. అనే అర్థం వ‌చ్చేలా ఆ మీమ్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Traffic meams

దీంతో దీనికి సంబంధించిన మీమ్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా అవుతోంది. ఓ యువ‌తి త‌న భ‌ర్త‌తో క‌లిసి ఎక్క‌డికో వెళ్తుంది. అయితే మ‌ధ్య‌లో వాళ్ల‌పాప కూడా ఉంది. నిజానికి ఇది ట్రిపుల్ రైడింగ్‌. ట్రాఫిక్ పోలీసుల‌కు తెలిస్తే చ‌లానా క‌ట్టాల్సి వ‌స్తుందని.. ఆమె బైక్ వెనుకాల ఉన్నా నెంబ‌ర్ ప్లేట్‌కు కాలు అడ్డుగా పెట్టింది. అయినా పోలీసులు ఆ బైక్‌ను ప‌ట్టుకున్నారు. దీంతో ఆ బైక్ ఎంత ఫైన్ పడిందో కూడా పొందుప‌రిచారు. చలాన్లు త‌ప్పించుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. అంతేగాని ఇలా విన్యాసాలు చేయ‌కండి అంటూ.. Traffic Rules వాహాన‌దారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు.