ఆరు దశాబ్దాల క్రితం నాలుగేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిన్న పిల్లాడు కమల్ హాసన్. ఆ తర్వాత అతనే ఒక యాక్టింగ్ గ్రంధాలయం అవుతాడని, ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటాడని ఎవరూ అనుకోని ఉండరు. నవంబర్ 7న 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కమల్ హాసన్, తన అరవై ఏళ్ల నటనా జీవితంలో చూసిన ఐకానిక్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం.
నాయకుడు (1987)
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కలయికలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ క్లాసిక్స్ లో ఒకటి. నాయకుడు జర్నీ ఆఫ్ ఏ పర్సన్, రైజ్ అండ్ డౌన్ ఫాల్ ఆఫ్ ఆ రియల్ లైఫ్ డాన్. ముంబై డాన్ వరదరాజన్ ముదలియార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన నాయకుడు కథ కథనం మ్యూజిక్ టేకింగ్ అన్నీ అద్భుతమే. ఇప్పటికీ ఇంటర్నేషనల్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ స్కూల్స్ లో నాయకుడు సినిమాని ఒక లెస్సన్ గా చెప్తూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ డెఫినెట్లి మేడ్ ఏన్ టెర్రిఫిక్ ఇంపాక్ట్ ఆన్ తమిళ్ అండ్ ఇండియన్ సినిమా.
పుష్పక విమానం (1987)
పాటలు, డాన్సులు, మాటలతో కళకళలాడే తెలుగు తమిళ సినిమాల్లో ఈ మూవీ ఒక ప్రయోగం. హీరోలు పేజిల డైలాగులు చెప్పే టైములో ఒక్క మాట లేకుండా సైలెన్స్ తో ఎమోషన్ ని కన్వే చేయడం చాలా గ్రేట్. ఎ ట్రూ ఎక్స్పరిమెంట్.
స్వాతిముత్యం (1986)
సాగరసంగమం సినిమాతో ఒక క్లాసిక్ మూవీ ఇచ్చిన కమల్ అండ్ కే విశ్వనాథ్ కలిసి చేసిన మరో అద్భుతం ఈ సినిమా. లోకజ్ఞానం లేని వ్యక్తిగా కమల్ నటన, ఇప్పటి హీరోలకి కూడా ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటుంది.
వసంత కోకిల (1982)
గతం మర్చిపోయిన అమ్మాయిని ఒక స్కూల్ టీచర్ దగ్గరకి తీసుకోని, చాలా జాగ్రత్త చూసుకుంటూ నెమ్మదిగా ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇంతలో గతం గుర్తొచ్చిన అమ్మాయి, అప్పటివరకూ తనని జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తిని మర్చిపోతుంది. ప్రేమించిన అమ్మాయే తనని మర్చిపోతే, ఆ అమ్మాయికి గతం గుర్తు చేసే పరిస్థితిలో కమల్ యాక్టింగ్ కన్నీరు పెట్టిస్తుంది. రాజమౌళి, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సింహాద్రి, వసంత కోకిల నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ.
సత్యభామ (1997)
ఆన్ స్క్రీన్ అండగా కనిపించే కమల్ హాసన్, మొదటిసారి లేడీ గెటప్ లో కనిపించి నవ్వించాడు. ఈ సినిమా కథ కమల్ రాయడం విశేషం.
భారతీయుడు (1996)
కమర్షియల్ సినిమాలకి మెసేజ్ ని అద్దడంలో దిట్ట అయిన శంకర్, నటనలో దిట్ట అయిన కమల్ కలిస్తే దాని ఇంపాక్ట్ భారతీయుడు సినిమాలా ఉంటుంది. మర్మ కళ తెలిసిన స్వాతంత్ర సమరయోధుడు, తప్పు చేస్తే కొడుకుని కూడా చంపడానికి వెనుకాడడు.
హే రామ్ (2000)
బెంగాల్ సెపరేషన్ నేపథ్యంలో హిందూ ముస్లిమ్ గొడవల చుట్టూ అల్లిన కథ ఇది. కమల్ రామ్ పాత్రలో కనిపించగా, షారుక్ అహ్మద్ పాత్రలో నటించాడు. కమల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది.
అభయ్ (2001)
ఇప్పటివరకూ కమల్ ని హీరోగానే చూశారు కాదు… అదే కమల్ విలన్ గా నటిస్తే ఎలా ఉంటుందో అభయ్ సినిమాలో కనిపిస్తుంది. నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కమల్, స్క్రీన్ పై ఇంకెవరినీ కనిపించకుండా చేశాడు.
సత్యం శివమ్ (2003)
తెనాలి సినిమాలో కమల్ కామెడీ టైమింగ్ మాత్రమే చూసిన వాళ్లు… ఈ సినిమాలో కామెడీతో పాటు సీరియస్ యాక్టింగ్ కూడా చూడొచ్చు. విప్లవ భావజాలం ఉన్న వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని, అతని స్నేహితుడే పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఈ మూవీలా ఉంటుంది.
దశావతారం (2008)
డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్, నాలుగు పాత్రలు చేసిన కమల్, ఇంకా చేయడానికి ఏముంది అనే ప్రశ్నకి సమాధానం ఈ సినిమా. ఒకే వ్యక్తి పది పాత్రల్లో కనిపించి మెప్పించడం, ప్రతి పాత్రకి అతనే డబ్బింగ్ చెప్పడం చాలా గొప్ప విషయం.
మహానది (1994)
భార్య చనిపోయి కుటుంబమే ప్రాణంగా బ్రతుకున్న తండ్రి, ఒక స్నేహితుడి కారణంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. తనకి ఎదురయ్యే ఊహించని సంఘటనల నుంచి కృష్ణస్వామి ఎలా బయటపడ్డాడు అనేది మహానది కథ.
విచిత్ర సోదరులు (1989)
గ్రాఫిక్స్ వచ్చి ఇప్పుడు సినిమాల్లో ఏమైనా చూపిస్తున్నారు కానీ అసలు ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో మరగుజ్జుగా కమల్ హాసన్ ఎలా నటించాడు అనేది ఆశ్చర్యపరిచే విషయం.
క్షత్రియపుత్రుడు (1992)
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఊరొచ్చిన శక్తి, ఊరంతా గౌరవించే తండ్రి చనిపోతే అతని స్థానంలో నిలబడతాడు. సొంత బాబాయ్, తమ్ముడు కలిసి ప్రజలని ఇబ్బంది పెడుతుంటే, శక్తి ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ.
సాగరసంగమం (1983)
కమల్ హాసన్ అనగానే ఉంగరాల జుట్టు, అందమైన రూపం కనిపిస్తుంది. అలాంటి కమల్ హాసన్, ఏజ్డ్ క్యారెక్టర్ లో చేసిన కంప్లీట్ డాన్స్ సినిమా సాగరసంగమం. కమల్ హాసన్ డాన్స్ స్కిల్స్ సాగరసంగమంలో కనిపిస్తాయి.
గుణ (1991)
మానసికంగా ఇబ్బంది పడే గుణ, డబ్బున్న అమ్మాయిని కిడ్నప్ చేస్తాడు. వీరి మధ్యలో ప్రేమ పుడుతుంది. మెంటల్లీ వీక్ ఉన్న గుణ క్యారెక్టర్ లో కమల్ జీవించాడు. ప్రియతమా నీవచట కుశలమా పాట వినే ఉంటారు కదా , ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ గుణ సినిమాలోదే.
పోతురాజు (2004)
ఒక మూస ధోరణిలో సాగుతున్న సినిమాలకి పోతురాజు సడన్ షాక్ లాంటిది. పోతురాజు కమల్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా, రోషోమన్ ఎఫెక్ట్ తో వచ్చిన పోతురాజు ఒక మర్డర్ చుట్టూ తిరుగుతుంది.
ఆకలి రాజ్యం (1981)
ఉద్యోగం లేక ఆర్ధిక సమస్యలతో రోజుకి ఒక పూట మాత్రమే తినే స్థోమత ఉన్న యువత పరిస్థితులని ఆకలి రాజ్యం సినిమాలో చూడొచ్చు. ఆత్రయ రాసిన సాపాటు ఎటు లేదు పాట, అప్పటి ఇండియన్ ఎకానమీకి స్లిప్పర్ స్లాప్ లాంటిది.
మరో చరిత్ర (1978)
ప్రేమకథా చిత్రాల గురించి మాట్లాడాలి అంటే ఇప్పటికీ ఫస్ట్ గుర్తొచ్చే సినిమా మరో చరిత్ర. తెలుగు అబ్బాయి తమిళ అమ్మాయి ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ వండర్ గా నిలిచింది.
తూర్పు పడమర (1975)
నలుగురు పాత్రల చుట్టూ తిరుగు బ్యూటిఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ. రజినీకాంత్ ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఇంద్రుడు చంద్రుడు (1989)
డ్యూయల్ రోల్ లో కమల్ నటించిన ఈ సినిమా గుడ్ అండ్ బ్యాడ్ మధ్య సాగే కథ. కరప్ట్ మేయర్ జీకే నాయుడుగా కమల్ హాసన్ నటన ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పటికీ వినిపిస్తున్న లాలిజో లాలీ జో పాట ఈ సినిమాలోనిదే
విశ్వరూపం (2013)
నటిస్తూ కమల్ డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా విశ్వరూపం. మోడరన్ టెర్రరిజం ఇష్యూ చుట్టూ సాగే ఈ సినిమా టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. 60 ఏళ్ల వయసులో కమల్ చేసిన స్టంట్స్ మెస్మరైజ్ చేస్తాయి.
మైఖేల్ మదన కామరాజు (1990)
ఒకే రూపంతో ఉన్న నలుగురు అన్నదమ్ముల కథ. నాలుగు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కమల్ హాసన్ నటించి మెప్పించాడు.
తెనాలి (2000)
, ఒక సీనియర్ సైకియాట్రిస్ట్, జూనియర్ సైకియాట్రిస్ట్ మధ్యలో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వ్యక్తి ఎంత ఇబ్బంది పడతాడు అనేది తెనాలి కథ. కంప్లీట్ ఫన్ రైడ్, కమల్ హాసన్ కామెడీ టైమింగ్ ఈ మూవీలో చూడొచ్చు.
ఉత్తమ విలన్ (2015)
అడ్వాన్స్డ్ స్టేజ్ బ్రెయిన్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న ఒక స్టార్ హీరో, తన గురువు దర్శకత్వంలో చివరి సినిమా చేయాలనుకున్న కథతో ఉత్తమ విలన్ తెరకెక్కింది. ఈ సినిమాలో స్టేజ్ ఆర్టిస్ట్ గా కమల్ నటన అద్భుతం.
మూగ నోము(చైల్డ్ ఆర్టిస్ట్)
నాలుగేళ్ల వయసులో కమల్ హాసన్ అనే బాలనటుడు తెరపై మొదటిసారి కనిపించిన సినిమా ఇది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కమల్ హాసన్ అవార్డ్ అందుకున్నాడు.
ఇవి మాకు తెలిసిన, మేము చూసిన కమల్ హాసన్ గొప్ప చిత్రాలు, ఇవి మాత్రమే కాకుండా మీకు తెలిసినవి, మీరు ఈ లిస్ట్ లో ఉండాలి అనుకున్న సినిమాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి…