రేపు ప్రభాస్ నుంచి బిగ్‌ అనౌన్స్‌మెంట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. రేపు ఉదయం 7.10 నిమిషాలకు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ చేస్తామని చెబుతూ ప్రభాస్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన దేని గురించి అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. దీంతో ఈ అనౌన్స్‌మెంట్ కోసం డార్లింగ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతన్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. పౌరాణిక గాథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రావణుడి పాత్రలో సైప్ అలీఖాన్ నటించనుండగా.. సీత పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.

సీత పాత్రలో ఫలానా హీరోయిన్ నటిస్తుందని అనేకమంది పేర్లు వినిపించాయి. దీంతో రేపు వచ్చే ప్రకటన సీత పాత్ర గురించేనా? అనే చర్చ జరుగుతోంది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది.