హైదరాబాద్ నగరంలో మునుపెన్నడు లేనంతగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి కఠిన సమయంలో సినీ తారలు వారి సహాయాన్ని అంధించేందుకు మరోసారి. ముందుకు వస్తున్నారు. మొదట అక్కినేని నాగార్జున 50లక్షలు ప్రకటించగా ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు వంటి వారు చెరో కోటి రూపాయలు ప్రకటించారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా 50లక్షల ఆర్థిక సహాయాన్ని అంధించాడు. ఆ వెంటనే దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి ఇద్దరు 5లక్షల చొప్పున విరాళాలు అందించారు. ఇక రౌడి స్టార్ విజయ్ దేవరకొండ కూడా సహాయం చేశాడు. కష్టాల్లో ఉన్నప్పుడు చెన్నై, కేరళ, ఆర్మీ వంటి వాటికి సహాయం చేసిన మనం ఇప్పుడు మన సిటీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని 10లక్షల విరాలన్నీ అందించారు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ హారిక హాసిని ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి 10లక్షలు విరాళాన్ని అంధించారు.