ఒక రోడ్డు ప్రమాదం రెండు ప్రాణాలను బలికొంది. మరణించినవారు సినిమా పరిశ్రమకు చెందిన వారు కావడంతో ఒక్కసారిగా వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న నందగోపాల్ రెడ్డి, అలాగే ఆయన తనయుడు కమలాకర్ రెడ్డి రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు.
కర్ణాటక, కేరళ, తమిళ్ నాడు, ఆంద్రప్రదేశ్.. ఇలా సినిమా పరిశ్రమ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలలో కమలాకర్, నంద గోపాల్ పంపిణీదారులుగా కొనసాగుతున్నారు. అలాగే నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన అనుభవం వారికి ఉంది. ఇక కమలాకర్ తండ్రిని ఆరోగ్య చికిత్స కోసం నెల్లూరు నుంచి హైదరాబాద్ కు అంబులెన్స్ లో తీసుకువస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరు మృతి చెందారని డ్రైవర్ గాయపడినట్లు పోలీసులు వివరణ ఇచ్చారు.