Tollywood: టీఎఫ్‌సీసీ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న మ‌హిళా క‌బడ్డి చిత్రం..

Tollywood: తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ (టీఎఫ్‌సీసీ) ప‌తాకంపై స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మ‌హిళా క‌బ‌డ్డీ అనే చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ రోజు ఈ చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కూడా పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు టీఎఫ్‌సీసీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఎఫ్‌సీసీ చైర్మ‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌, టీఎఫ్‌సీసీ వైస్ చైర్మ‌న్ ఏ. గురురాజ్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కాచెం స‌త్య‌నారాయ‌ణ పాల్గొన్నారు.

TFCC new movie

ఈ సంద‌ర్భంగా టీఎఫ్‌సీసీ చైర్మ‌న్ డా. ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీలో మ‌హిళ‌ల‌తో స్పోర్ట్స్ నేప‌థ్యంలో మ‌హిళా క‌బ‌డ్డీ చిత్రాన్ని ప్రారంభించామ‌ని తెలిపారు. ఈ చిత్రం కోసం మంగ్లీ, మ‌ధుప్రియ‌, గీతామాధురి, శ్రావ‌ణ‌భార్గ‌వి లాంటి పేరున్న సింగ‌ర్స్ పాడార‌ని తెలిపారు.ఇందులో నిజ‌మైన క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్ న‌టించ‌నున్నారు.. ఇటీవ‌లే ఆల్ ఇండియా క‌బ‌డ్డీ కోచ్‌ని మా సినిమా కోసం సంప్ర‌దించి కొన్ని స‌ల‌హాలు తీసుకున్నాం.. ఇందులో కొత్త వారికి అవ‌కాశం ఇస్తున్నాం.. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించి విష‌యాను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.