Tollywood: “మిస్ ఆంద్ర‌ప్ర‌దేశ్” సంవిత న‌టిస్తున్న “ఫాతిమా ఫ్ర‌మ్ పాకిస్థాన్ వ‌యా చైనా” చిత్ర ప్రారంభోత్స‌వం..

Tollywood: శ్రీ చండ్ర మూవీస్ ప‌తాకంపై చండ్ర మ‌ధు నిర్మిస్తూ.. క‌థ‌ను అందిస్తున్న చిత్రం ఫాతిమా ఫ్ర‌మ్ పాకిస్థాన్ వ‌యా చైనా. ఈ చిత్రానికి కృష్ణ తోట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సంవిత‌, భావ‌న‌, ఈశ్వ‌ర్‌, ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా..ఇవాళ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఈ చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు చిత్ర‌బృందం. ఈ కార్య‌క్ర‌మంలో దామోద‌ర్ ప్రసాద్ గారు క్లాప్ కొట్ట‌గా, టీఎఫ్‌పీసీ కార్య‌ద‌ర్శులు మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌గారు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.. అలాగే తుమ్మ‌ల ప్ర‌స‌న్న కుమార్ గారు తొలి షాట్‌కు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ తోట కృష్ణ మాట్లాడుతూ..

Tollywood New Movie

ఈ చిత్రానికి క‌థ‌ను అందిస్తూ.. నిర్మిస్తున్న చండ్ర మ‌ధు గారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఒక పాకిస్థాన్ అమ్మాయి.. ఇండియాకు వ‌చ్చింత‌ర్వాత ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ఎలా మ‌లుచుకుంది అనే పాత్ర‌లో మిస్ ఆంద్ర‌ప్ర‌దేశ్ సంవీత పోషిస్తుంది అని అన్నారు. ఈ చిత్ర నిర్మాత చండ్ర మ‌ధు మాట్లాడుతూ.. ఈ చిత్రం గురించి ప్రారంబోత్స‌వ కార్య‌క్రమంలో మాట్లాడ‌డం మంచిది కాదు.. ఈ చిత్రంలో న‌టీన‌టులు అంతా కొత్త వాళ్ల‌నే తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఈ చిత్ర క‌థ‌కు డైరెక్ట‌ర్ తోట కృష్ణ అయితేనే బాగుంటుంద‌ని అనుకున్నాను అని అన్నారు. ఇక టీఎఫ్‌పీసీ సెక్ర‌ట‌రీ మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల గారు మాట్లాడుతూ.. ఈ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ.. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం నుంచే ప్ర‌మోష‌న్స్ చేయ‌డంలో మా త‌ర‌పున స‌హ‌య స‌హాకారాలు త‌ప్ప‌కుండా ఉంటాయ‌ని తెలిపారు.