కోటి రూపాయలు తీసుకుంటూ ఈ పనేంటో?

కన్నడ బ్యూటీ రష్మికా మందన్నాకి ప్రస్తుతం తెలుగులో మంచి మార్కెట్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న రష్మిక, ఒక్కో సినిమాకి దాదాపు కోటి రూపాయలు పారితోషికం అందుకుంటుంది. ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఆ స్థాయి మొత్తం తీసుకునే వారిలో రష్మిక ఒకరు. అనతి కాలంలోనే ఈ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక చీపుగా షాంపూలు కొట్టేసే అలవాటు ఉందంటే మీరు నమ్ముతారా? నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ అదే నిజం.

షూటింగ్స్ సమయంలో ఏకమొడేషన్ కోసం బుక్ చేసే హోటల్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న షాంపూలు నచ్చితే దొంగిలిస్తానని స్వయంగా రష్మికనే చెప్పుకొచ్చింది. ఫ్యాన్స్ తో ఆన్లైన్ ఇంట్రాక్షన్ పెట్టిన రష్మిక, లైవ్ లో మాట్లాడుతూ… ఓసారి తలగడ దిండు కవర్లు కూడా కొట్టేశానని అన్నారు. అప్పుడు ఆ పని చేసినందుకు ఇప్పుడు అపరాధ భావంతో ఉన్నానని రష్మిక చెప్పింది. ఇది విన్న కొంతమంది ఇదంతా మాములే అనుకుంటూ ఉంటే, మరికొందరు మాత్రం ఒక సినిమాకి కోటి రూపాయలు తీసుకుంటూ ఇదేం పాడుబుద్ది అని సెటైర్లు వేస్తున్నారు.