నితిన్ భార్య బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌.. సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌!

టాలీవుడ్ హీరో నితిన్ భార్య షాలిని పుట్టినరోజు సంద‌ర్భంగా తన కుటుంబస‌భ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా వేడుక‌ను నిర్వ‌హించారు. లాక్‌డౌన్‌లో జూలై 26న వీరి వివాహం జ‌ర‌గ‌గా.. పెళ్ళి త‌ర్వాత వ‌చ్చిన భార్య బ‌ర్త్‌డేని అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య వేడుక‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేశాడు నితిన్‌. ఈ వేడుక‌కు టాలీవుడ్ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్, భీష్మ ద‌ర్శ‌కుడు వంశీ కుడుముల హ‌జ‌ర‌య్యారు. ఈ బ‌ర్త్‌డే పార్టీ ఫోటోల‌ను నితిన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

NITIN WIFE BIRTHDAY CELEBRATIONS

నా అంద‌మైన భార్య‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు నా రోజులోని సంతోష‌క‌ర‌మైన క్ష‌ణాలు.. నేను నీతో గ‌డిపిన స‌మ‌యాలని, నీతో జీవిత‌కాలం ప్రేమ‌లో ఉంటా.. అంటూ ట్వీట్ చేశారు. దీనికి భార్య‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ క్ర‌మంలో పుట్టినరోజు వేడుక‌లు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. ఇదిలాఉంటే నితిన్ ప్ర‌స్తుతం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రంగ్‌దే సినిమాలో, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో చెక్ అనే సినిమాలు చేస్తున్నాడు.