అల్లు అర్జున్‌కు అరుదైన ఘనత.. ఇండియా నుంచి తొలి హీరో బన్నీనే

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2020లో అత్యంత ప్రభావంతులైన 25 యువ భారతీయుల జాబితాలో బన్నీ చోటు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఏ హీరో ఈ ఘనతను సొంతం చేసుకోలేదు. దీంతో ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. ఇక ఈ జాబితాలో అనుష్క శర్మకు చోటు దక్కింది.

allu arjun another milostone

తాజాగా వివిధ రంగాల్లో అత్యంత ప్రభావం చూపిన 25 మంది వ్యక్తుల జాబితాను వ జీక్యూ మ్యాగజైన్ విడుదల చేసింది. ఫిబ్రవరి ఎడిషన్‌లో ఈ వివరాలను పొందుపర్చనుంది. గత ఏడాది అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటలుగా అవి నిలిచాయి.