త్వరలో ఓటీటీలోకి భారీ సినిమాలు రానున్నాయా?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ బంద్ అవ్వడంతో… చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు నేరుగా థియేటర్స్ లోకి రాగా, రాబోయే కాలంలో రిలీజయ్యే సినిమాలేవో చూద్దాం. ఈ లిస్ట్ చేరబోయే భారీ సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది వెంకీ మామ హీరోగా నటిస్తున్న దృశ్యం2 సినిమా గురించే. మలయాళ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మలయాళంలో కూడా అమెజాన్ ఓటీటీలోనే రిలీజ్ అయిన దృశ్యం 2, తెలుగులో కూడా ఓటీటీ బాటే పడనుంది.

ఈ లిస్ట్ లో చేరే అవకాశం ఉన్న రెండో సినిమా యంగ్ హీరో నితిన్ ది. భీష్మ హిట్ తో మంచి ఊపుమీదున్న నితిన్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ అంధాదున్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషిస్తుండగా నభ నటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాస్ట్రోని కూడా ఓటీటీ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నారట. ఓటీటీ వైపు అడుగులు వేస్తున్న మరో మూవీ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పాగల్. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో, దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా అసోసియేషన్ తో వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాను కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ మూడు సినిమాల ఓటీటీ విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు థియేటర్ రిలీజా లేక ఆన్లైన్ స్ట్రీమింగా అనేది త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.