BIG BREAKING: ప్రముఖ టాలీవుడ్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమించడంతో కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి గురి అయింది. నర్సింగ్ యాదవ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, నటులు సంతాపం ప్రకటిస్తున్నారు.

NARSING YADAV

టాలీవుడ్‌లొ అనేక సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్ పాత్రలతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఠాగూర్, మాస్టర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్, గాయం, పోకిరి, యమదొంగ లాంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. మంచి నటుడు మరణించడం టాలీవుడ్‌కు తీరని లోటు అని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలతో కలిపి మొత్తం 300కి పైగా సినిమాల్లో నటించారు. నర్సింగ్ యాదవ్ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. హేమాహేమీలు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణక్షణం సినిమాలోని తన పాత్రతో నర్సింగ్ యాదవ్ పాపులర్ అయ్యారు.