Tollywood: నేడు మ‌హిళ దినోత్స‌వం.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు విషెస్‌!

Tollywood: నేడు మ‌హిళ దినోత్స‌వం శుభాకాంక్ష‌లు సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వీర‌వ‌నిత‌ల‌కు విషెస్ తెలిపారు. ఈ క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు త‌న త‌ల్లి, భార్య న‌మ‌త్రా, కూతురు సితార ఫోటోల‌ను షేర్ చేస్తూ.. మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హిళ‌లు అత్యున్న‌త స్థానంలో ఉండాల‌ని, నా చుట్టూ ఉన్న మ‌హిళ‌ల‌తో పాటు ప్ర‌పంచంలో ఉన్న అతివ‌లంద‌రికి మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ పోస్ట్ చేశారు మ‌హేశ్‌.

Tollywood

అలాగే Tollywood టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య త‌న త‌ల్లి కాలికి సేవ‌లు చేస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. మ‌న ఇంట్లోని మ‌హిళ‌లు చిరున‌వ్వులు చిందిస్తే ప్ర‌పంచ‌మంతా ఆనందంగా ఉంటుంది.. నా లోకంలోని మ‌హిళ‌తో పాటు ప్ర‌పంచంలోని ప్ర‌తీ అతివ‌కు మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ నాగ‌శౌర్య తెలిపాడు. అలాగే, Tollywood హీరో సుధీర్‌బాబు, డైరెక్ట‌ర్ బాబీ కూడా మ‌హిళ‌ల‌కు ఉమెన్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపారు.