నేడు వ‌రుణ్‌తేజ్ బ‌ర్త్‌డే.. చిన్న‌ప్ప‌టి ఫోటోను పోస్ట్ చేసిన నాగ‌బాబు..

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా వ‌రుణ్‌కు త‌న కుటుంబ‌స‌భ్యులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, మెగాభిమానులు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. అయితే వ‌రుణ్‌తేజ్ తండ్రి నాగ‌బాబు ఒక అపురూప చిత్రాన్ని సోష‌ల్ మీడియా వేదికగా వ‌రుణ్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. వ‌రుణ్‌తేజ్ చిన్న‌ప్ప‌టి ఆ ఫోటోలో.. నాగ‌బాబు, వ‌రుణ్ త‌ల్లి ప‌ద్మ‌జ‌, నిహారిక ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

varuntejjj

ఇక వ‌రుణ్‌తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం నుంచి మోష‌న్ పోస్ట‌ర్‌, టైటిల్‌ను చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఆ పోస్ట‌ర్లో వ‌రుణ్ బాక్సింగ్ చేస్తూ.. ఎన‌ర్జిటిక్ లుక్‌లో సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ గ‌నిగా ఖ‌రారు చేశారు చిత్ర‌బృందం. ఈ సినిమాను కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు బాబీతో పాటు రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ బ్యాన‌ర్స్‌పై సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వ‌రుణ్‌కు స‌ర‌స‌న ప్ర‌ముఖ హిందీ న‌టుడు మ‌హేశ్ ముంజ్రేక‌ర్ కుమార్తె సాయి ముంజ్రేక‌ర్ హీరోయిగా న‌టిస్తుండ‌గా.. వ‌రుస చిత్రాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందుకున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కురుస‌స్తున్నారు.