Sharwanandh: శ‌ర్వాతో కేక్ క‌ట్ చేయించిన రాంచ‌ర‌ణ్‌!

Sharwanandh: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ శ‌ర్వాతో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేయించారు. అయితే వీరిద్ద‌రు చిన్న‌నాటి స్నేహితుల అనే విష‌యం తెలిసిందే. Sharwanandhశ‌ర్వానంద్ చ‌ర‌ణ్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్‌. నిరంత‌రం క‌లుస్తుంటారు. స్నేహితుడు శ‌ర్వానంద్ అంటే చ‌ర‌ణ్ కు ఎంత అభిమాన‌మో.. అందుకే నేడు శ‌ర్వానంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చ‌ర‌ణ్ స్వ‌యంగా త‌న‌ని క‌లిసి బ‌ర్త్‌డే విషెస్ తెలిపడ‌మే కాకుండా.. ద‌గ్గ‌రుండి మ‌రీ కేక్ క‌టింగ్ చేయించారు.

Cherry sharwa

ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను Sharwanandh శ‌ర్వానంద్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశాడు. గ్రేట్ పార్టీ ఇచ్చినందుకు రామ్ చ‌ర‌ణ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఇక శ‌ర్వానంద్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం మ‌హాస‌ముద్రం నుంచి ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆర్ఎక్స్‌100 ఫేం డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో సిద్దార్ధ్‌, అదితిరావు హైద‌ర్‌, అనుఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.