Nagashourya: నేడు నాగ‌శౌర్య బ‌ర్త్‌డే.. వ‌రుసగా పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేశారు..

Nagashourya: టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా నాగ‌శౌర్య న‌టిస్తున్న‌ చిత్రాల నుండి టీజ‌ర్‌, ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు. శౌర్య కెరీర్లో 20వ చిత్రంగా వ‌స్తున్న చిత్రంగా వ‌స్తున్న ల‌క్ష్య నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ చిత్రాన్ని ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై శ‌ర‌త్‌మ‌రార్‌, నారాయ‌ణ్‌దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఆర్చ‌రీ ఆధారంగా స్పోర్ట్స్ డ్రామాగా ల‌‌క్ష్య చిత్రం తెరకెక్కుతుండ‌గా.. ఇందులో Nagashourya నాగ‌శౌర్య స‌ర‌స‌న కేతికా శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

అలాగే ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, స‌చిన్ ఖేడేక‌ర్ త‌దితరులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించగా.. ఇక ఈ చిత్ర టీజ‌ర్ విష‌యానికొస్తే.. చాలా మందికి ఆడితే గుర్తింపు వ‌స్తుంది.. కానీ ఎవ‌డో ఒక‌డు పుడ‌తాడు.. ఆట‌కే గుర్తింపు తెచ్చేవాడు.. అంటూ జ‌గ‌ప‌తిబాబు చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. ఇందులో Nagashourya నాగ‌శౌర్య ఆర్చ‌రీ ఆట‌కు గుర్తింపు తేవ‌డం.. ఆర్చ‌రీకి దూరం అవ్వ‌డం మ‌ళ్లీ త‌న ల‌క్ష్యం కోసం పోరాటం వంటివి సినిమాలో చూపించారు. ప‌డి లేచిన వాడితో పందెం వేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం అంటూ వ‌చ్చిన ల‌క్ష్య టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటుంది. కాగా ఈ చిత్రానికి కాలా భైరవ సంగీతం సమకూర్చారు.

అలాగే నాగ‌శౌర్య నటిస్తున్న‌‌ మ‌రో చిత్రం వ‌రుడు కావ‌లెను. Nagashourya శౌర్య బ‌ర్త‌డే సంద‌ర్భంగా.. ఈ చిత్రం నుంచి ఓ అంద‌మైన, ఆక‌ర్ష‌ణీయ‌మైన వీడ‌యోను చిత్ర‌బృందం విడుద‌ల చేశారు. ఇందులో నాగ‌శౌర్య రెట్రో లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఇక ఈ వీడియోలో వ‌రుడు కావ‌లెను 2021మే నెల‌లో చిత్రం విడుద‌ల అవుతుంద‌న్న విష‌యం కూడా తెలిపారు. ఈ చిత్రాన్ని తొలిసారిగా ల‌క్ష్మీ సౌజ‌న్య డైరెక్ట్ చేస్తోండ‌గా.. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాలో Nagashourya నాగ‌శౌర్యకు స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రోవైపు కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పోలీసు వారి హెచ్చ‌రిక చిత్రంలో నాగ‌శౌర్య న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించి శౌర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ చిత్రాన్ని మ‌హేశ్‌. ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి హీరోగా పరిచ‌య‌మైన Nagashourya ల‌వ‌ర్‌బాయ్ నాగ‌శౌర్య‌. తొలి చిత్రంతోనే న‌టుడిగా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో ఆయ‌న‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఇక శుక్ర‌వారం హీరో నాగ‌శౌర్య పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా టీఎఫ్‌పిసీ త‌ర‌పున Nagashourya నాగ‌శౌర్య గారికి హ్య‌పీ బ‌ర్త్‌డే.