Nagashourya: నాగ‌శౌర్య బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. హాజ‌రైన 5గురు డైరెక్ట‌ర్లు!

Nagashourya: టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సినిమాల ద‌ర్శ‌కులు శౌర్య బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు. నాగ‌శౌర్య ఏలూరులో పుట్టి పెరిగిన‌.. సినిమాల మీద మక్కువ‌తో యాక్టింగ్ నేర్చుకుని ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు. నాగ‌శౌర్య 2011లో తెర‌కెక్కిన క్రికెట్ గ‌ర్ల్స్ అండ్ బీర్ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శౌర్య.. 2014లో ఊహ‌లు గుస‌గుస‌లాడే అనే సినిమాతో హీరోగా తొలి స‌క్సెస్ కొట్టాడు.

nagashourya

అనంత‌రం దిక్కులు చూడ‌కు రామ‌య్య‌, క‌ళ్యాణ వైభోగ‌మే, జ్యో అచ్యుతానంద‌, ఛ‌లో వంటి ప‌లు చిత్రాల‌తో న‌టుడిగా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు నాగ‌శౌర్య‌. ఇక తాను అశ్వ‌ద్ధామ చిత్రానికి క‌థ అందించాడు.. కానీ ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రచింది. ప్ర‌స్తుతం Nagashourya శౌర్య వ‌రుస సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌కత్వంలో ల‌క్ష్య సినిమాలో, కేపి రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో పోలీసు వారి హెచ్చ‌రిక సినిమాలో, ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుడు కావ‌లెను, శ్రీ‌మాన్‌, అనీస్ కృష్ణ ద‌ర్శ‌కుల‌తో.. ఈ ఐదుగురు ద‌ర్శ‌కులు తెర‌కెక్కించే చిత్రాల్లో Nagashourya నాగ‌శౌర్య న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమాల డైరెక్ట‌ర్ల్ శౌర్య పుట్టిన రోజ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈ ఏడాది అంతా శౌర్య సినిమాలు బాగానే సంద‌డి చేసేలా క‌నిపిస్తున్నాయి. ‌