Jayaprada: నేడు జ‌య‌ప్ర‌ద బ‌ర్త్‌డే..రాజేంద్ర‌ప్ర‌సాద్ న్యూ మూవీ టీం విషెస్‌!

Jayaprada: ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు జ‌య‌ప్ర‌ద నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా తాజాగా రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ చిత్రంలో ఆమె ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది. నేడు ఆమె బ‌ర్త్‌డే కానుక‌గా హ్యాపీ బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ.. చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. అందులో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌యప్ర‌ద రొమాంటిక్ లుక్ లో క‌నిపించారు. ఇదిలా ఉంచితే ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్బంగా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం. అందానికి అసూయ పుట్టే అందం ఆమెది. న‌టిగా దేశం మొత్తం గ‌ర్వించ‌ద‌గ్గ ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌, క‌ళా త‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సాగ‌ర‌సంగ‌మం చిత్రంలో ఆమె మాధ‌వి పాత్ర‌ను పోషించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. జ‌య‌ప్ర‌ద స్వ‌స్థ‌లం రాజ‌మండ్రి. ఆమె 1974 సంవ‌త్స‌రంలో భూమికోసం అనే చిత్రంలో తొలిసారి న‌టించారు. ఆ చిత్రంలో ఆమె కేవలం రెండున్న‌ర నిమిషాలుగా వితంతువుగా న‌టించి ఎంతో మెప్పించింది. సాంఘీక చిత్రాల్లోనే కాకుండా పౌరాణిక‌, జాన‌ప‌ద, చారిత్ర‌క చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో క‌నువిందు చేసింది. త‌న అందానికి క్లాస్ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌టి.. అడ‌వి రాముడు, ఊరికి మొన‌గాడు లాంటి మాస్ చిత్రాల్లో న‌టించి.. సీతా క‌ళ్యాణం, శ్రీ తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర క‌ల్యాణం లాంటి పౌరాణిక పాత్ర‌ల‌తో సీత‌, ప‌ద్మావ‌తిగా ప్రేక్ష‌కాభిమానం పొందింది. సింహాస‌నం, రాజ‌పుత్ర, ర‌హ‌స్యం వంటి జాన‌ప‌ద చిత్రాల్లో రాజ‌కుమారిగా సినీ ప్రేక్ష‌కుల్లో నుంచి విశేష అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక అలా మొద‌లైన ఆమె సినీ కెరీర్ ఎనిమిది భాష‌ల్లో దాదాపు 300పైగా చిత్రాల్లో న‌టించింది. ఇక ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీఎఫ్‌పీసీ త‌ర‌పున పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.‌‌