Director Viswanath: నేడు క‌ళాత‌ప‌స్వి కే. విశ్వ‌నాథ్‌గారి బ‌ర్త్‌డే. మెగాస్టార్ విషెస్‌!

Director Viswanath: దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు గ్ర‌హీత ప‌ద్మ‌శ్రీ కె. విశ్వ‌నాథ్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. గురు తుల్యులు, పితృ స‌మానులు, మ‌హోన్న‌తమైన ద‌ర్శ‌కులు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలియ‌జేసిన క‌ళ‌త‌ప‌స్వి శ్రీ కే. విశ్వ‌నాథ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రాలు ఆణిముత్యాలు, తెలుగు వారికి చిర‌స్మ‌ర‌ణీయం.

chiru wishes

Director Viswanath ఆయ‌న ఆయురారోగ్యాల‌తో క‌ల‌కాలం సంతోషంగా ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. Director Viswanathకే. విశ్వనాథ్ డైరెక్ష‌న్‌లో తెరెకెక్కించిన శుభ‌లేఖ‌, స్వ‌యంకృషి, ఆప‌ద్భాంద‌వుడు వంటి చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి న‌టించారు. ఈ చిత్రాలు ఆనాటీకి, ఈ నాటికీ ప్రేక్ష‌కుల్లో మ‌దిలో ఎప్ప‌టికీ నిలిచే ఉంటాయి. కే. విశ్వ‌నాథ్ Director Viswanathతెర‌కెక్కించిన శంక‌రాభ‌ర‌ణం చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతి ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేశారు. క‌ళాత‌ప‌స్వి ద‌ర్శ‌కుడు కే.విశ్వ‌నాథ్‌కు టీఎఫ్‌పీసీ త‌ర‌పున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.