Brahmanandam: నేడు టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందం బ‌ర్త్‌డే.. హాల్‌చ‌ల్ చేస్తోన్న బ్ర‌హ్మీ హ్యాష్ ట్యాగ్‌!

Brahmanandam: స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందం అంటేనే హ‌స్య‌లోకానికి రారాజు.. సినీ ప్రేక్ష‌కుల‌కు ద‌క్కిన న‌వ్వుల వ‌రం. నేడు బ్ర‌హ్మ‌నందం జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా టీఎఫ్‌పిసి(తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌) ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. ఆయ‌న గురించి ఆస‌క్తిక‌ర‌ విష‌యాల‌ను సినీ ప్రేక్ష‌కుల‌తో పంచుకుందాం.

today brhamanandam birthday

Brahmanandam బ్ర‌హ్మ‌నందం అప్ప‌టివ‌ర‌కు చిన్న చిన్న పాత్ర‌లు చేసిన ఆయ‌న జంధ్యాల తెర‌కెక్కించిన‌ ఆహానా పెళ్లంట సినిమాతో తొలి విజ‌యాన్ని ఆస్వాదించారు. ఈ సినిమాలో బ్ర‌హ్మ‌నందం అర‌గుండుతో కామెడీని ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేరు. అంతగా ఈ సినిమాలో Brahmanandam బ్ర‌హ్మ‌నందం జోరు క‌నిపించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొన‌గాళ్లు తో ప్రారంభ‌మై.. చిరంజీవితో ఖ‌చ్చితంగా బ్ర‌హ్మ‌నందం న‌టించేలా చేసేవారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంతాగానో ఆకట్టుకునేలా చేశాయి‌. అలాగే Brahmanandam బ్ర‌హ్మ‌నందం మ‌నీ సినిమాలో చేసిన ర‌చ్చ అంతాఇంతా కాదు.. వారెవ్వా ఏమీ ఫేసూ అచ్చం హీరోలా ఉంది బాసూ అంటూ, ఖాన్ దాదా పాత్ర‌లో సీరియ‌స్‌గా క‌నిపిస్తూనే కామెడీ పండిస్తూ ఈ సినిమా స్థాయిని మ‌రింత పెంచింది. ఇలా ప‌లు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్ష‌కుల్లోనే కాకుండా హిందీ, త‌మిళ్ ప్రేక్ష‌కుల్లో కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నా న‌టుడు Brahmanandam బ్ర‌హ్మ‌నందం. ఇక ఫిబ్ర‌వ‌రి 1న బ్ర‌హ్మ‌నందం 65ఏళ్లు నిండుతున్నాయి. దీంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌న అభిమానులు విప‌రీత‌మైన హ‌డావిడి చేస్తున్నారు. బ్ర‌హ్మ‌నందం బ‌ర్త్‌డేను ట్రెండింగ్‌లో ఉంచేందుకు త‌న ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్‌ను ఏర్పాటు చేశారు. హ్యాపీ బ‌ర్త్‌డే బ్ర‌హ్మ‌నందం అంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అలాగే బ్ర‌హ్మ‌నందం పాత‌వి, కొత్త‌వి ఫోటోల‌ను, వీడియోల‌ను జోడీంచి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. దీంతో Brahmanandam బ్ర‌హ్మానందం బ‌ర్త్‌డే హ్యాష్ ట్యాగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.