Adipurush Lakshman: ప్రభాస్ తమ్ముడి పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో?

Adipurush Lakshman: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సినిమా ఆదిపురుష్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక దీంతో పాటు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సలార్ లో కూడా ప్రభాస్ నటించనున్నాడు. పాన్ ఇండియా ఈ రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

tiger shroff adipurush lakshman

భారీ బడ్జెట్‌తో టీ సిరీస్ బ్యానర్ ఈ సినిమా తెరకెక్కించనుండగా.. హాలీవుడ్ టెక్నీషియన్లు దీనికి పనిచేయనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. అయితే ఇందులో లక్ష్మణుడు పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. కానీ అనేకమంది పేర్లు వినిపించాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ తమ్ముడి పాత్రను బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ పోషించనున్నట్లు తెలుస్తోంది.