ఈసారి ఏ కథని రీమేక్ చేస్తున్నారో…

కిక్, ఫ్లై, పంచ్, రిపీట్… బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న ఓన్లీ రూల్స్ ఇవే. ఇప్పటి వరకూ ఈ రూల్స్ ని ఫాలో అవుతూ టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ సిరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా మన వర్షంకి రీమేక్ అయితే, రెండోది అడవి శేష్ క్షణం సినిమాకి రీమేక్. మన కథలకి గ్రాండియర్నెస్ ని అద్దుతూ, బాలీవుడ్ స్టైల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఇప్పుడు భాగీ సిరీస్ లోని మూడో సినిమాకి రంగం సిద్దమయ్యింది.

సేమ్ టీంని రిపీట్ చేస్తూ సాజిద్ నడియావాలా భాగీ3 సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టారు. బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్, ఏడు రోజుల పాటు జరగనుంది. సెర్బియా, జార్జియాలో తర్వాతి షెడ్యూల్ మొదలు పెట్టనున్నారట. అక్టోబర్‌లో నెల చివరి లోపు షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా కపూర్ భాగీ3లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020 మార్చి 6న విడుదల కానుంది. అయితే ఇప్పటివరకూ వచ్చిన రెండు భాగీ సినిమాలు తెలుగు కథలతో వచ్చినవే కావడంతో, మూడో పార్ట్ ఏ చిత్రాన్ని రీమేక్‌గా తీస్తారో చూడాలి.