ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయిన బాలీవుడ్ జంట

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో హీరోయిన్ దిశా పటానీ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరు మాత్రం ఎప్పుడూ దీనిని కన్ఫామ్ చేయలేదు. కానీ ఈ లవ్ బర్డ్స్ ఎప్పుడూ బయట కలిసి తిరుగుతూ కనిపిస్తూనే ఉంటారు. తాజాగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ లవ్ కపుల్స్ మాల్ధీవులకు వెళ్లారు. అక్కడ న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ వీరిద్దరూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. తెలుపు రంగు బికినీలో దిశా పటానీ పెట్టిన ఫొటో బాగా వైరలైంది.

tiger-shroff-and-disha-patani
tiger-shroff-and-disha-patani

మాల్ధీవుల టూర్ పూర్తి చేసుకుని ఈ జంట తిరిగి ముంబైకి చేరుకుంది. ఈ సందర్భంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరు కలిసి నడుచుకుంటూ వస్తుండగా.. మీడియా కంట పడ్డారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరు కనిపించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలోనలుపు రంగు దుస్తులలో ఈ కఫుల్స్ కనిపించారు. ట్రాక్ ప్యాంటు, క్రాప్ టాప్ స్టైల్ జాకెట్‌ను దిషా ధరించగా,.. టైగర్ నల్లటి టీ షర్టు, జీన్స్ ధరించారు.

దిశా ప్రస్తుతం సల్మాన్‌ హీరోగా వస్తున్న రాధే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో నటించింది.