టాలీవుడ్ టాప్ సింగర్ సునీత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక ప్రైవేట్ హోటల్లో వీరి పెళ్లి జరగనుందని వార్తలొస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో సునీతకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కొంతమంది మాత్రమే ఈ పెళ్లికి హాజరై అవకాశముంది. యాంకర్ సుమ, జాన్సీ ఆమెకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్.
దీంతో వారిద్దరితో పాటు మరికొంతమంది స్నేహితులు పెళ్లికి హాజరయ్యే అవకాశముంది. సునీత కుమారుడు, కూతురు పెళ్లి పనులను దగ్గర ఉండి చూసుకుంటున్నారు. కుమారుడు, కూతురు బలవతంతోనే సునీత రెండో పెళ్లికి ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సునీత-రామ్ ఎంగేజ్మెంట్ పూర్తవ్వగా.. జనవరి లేదా ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగుతుందని వార్తలొస్తున్నాయి.
కానీ జనవరి నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడంతో డిసెంబర్ 26న పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో బంధువులు, సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి పిలుస్తున్నారు.