ఈ సెలబ్రెటీలకు ఇది ఎప్పటికీ మరిచిపోలేని దీపావళి

దీపావళి అంటేనే కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీపావళి వచ్చిందంటేనే ప్రతిఒక్కరిలో ఆనందం ఊరకలేస్తుంది. గత డిసెంబర్ నుంచి కరోనా ప్రభావం వల్ల అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో పండుగలు జరుపుకోలేని పరిస్థితి.

kajol garwal

ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిన క్రమంలో ఈ దీపావళి పండుగను గ్రాండ్‌గా జరుపుకోవాలని సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు ప్రతిఒక్కరూ భావిస్తున్నారు. కానీ కొంతమంది సెలబ్రెటీలకు మాత్రం ఈ దీపావళి ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఈ మధ్య పెళ్లిపీటలెక్కిన వీళ్లు కొత్త లైఫ్‌ను ప్రారంభించిన తర్వాత తొలిసారి దీపావళి జరుపుకుంటున్నారు.

హీరోయిన్ కాజల్ అగర్వాల్-గౌతమ్ జంట ఇటీవలే పెళ్లి చేసుకుని ప్రస్తుతం హానీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. వీరికి ఈ దీపావళి ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఇక లాక్‌డౌన్ కాలంలో పెళ్లి చేసుకున్న నితీన్-శాలినీ, రానా-మిహీక, యోగి బాబు-మంచు భార్గవి, సతీష్-సింధూ, మహత్-ప్రచీ, ఆర్‌కే సురేష్-మథు జంటలకు ఈ దీపావళి ప్రత్యేకమే..