తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టాప్ 12 పోటీదారులు వీరే

వరల్డ్ బిగ్గెస్ట్ తెలుగు సింగింగ్ రియాలిటీ షో – తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 షో కీలక దశకు చేరుకుంది. 37 దేశాలలో 15000+ ఆడిషన్స్ లో 100 మందికి పైగా అద్భుతమైన గాయకులకు జడ్జస్ – థమన్, కార్తీక్, గీతా మాధురి ముందు ఆడిషన్‌కు అవకాశం లభించింది. 2 వారాల పాటు సాగిన నాలుగు ఎపిసోడ్‌ల ఆడిషన్‌లు – ఎక్స్‌ట్రార్డినరీ సింగింగ్, మల్టీ టాలెంటెడ్ సింగర్‌లు, వారి కలలను నెరవేర్చుకోవడానికి వచ్చిన కొన్ని ఎమోషనల్ స్టోరీస్ మనసుని హత్తుకున్నాయి.

ఈ షో హిస్టరీ లో తొలిసారి – నేరుగా టాప్ 12కి అర్హత సాధించిన 6 గోల్డెన్ మైక్‌లు అందుకున్నారు. గోల్డెన్ టిక్కెట్ల విజేతలలో థియేటర్ రౌండ్ ఆడిషన్‌లు నిర్వహించబడ్డాయి. మిగిలిన టాప్ 12 కంటెస్టెంట్స్ ఎపిక చేశారు. జూన్ 28 నుండి ఈ టాప్ 12 కంటెస్టెంట్స్ తెలుగు ఇండియన్ ఐడల్ విజేత టైటిల్ కోసం పోటీపడతారు. ప్రేక్షకుల ఓటింగ్, న్యాయమూర్తుల తీర్పు ఆధారంగా విజేతని ఎంపిక చేస్తారు.

టాప్ 12 కంటెస్టెంట్స్:

స్కంద, వల్లభ, అనిరుధ్ ,కీర్తన, శ్రీ కీర్తి, హరిప్రియ , కేశవ్ రామ్, రజినేష్ పూర్ణిమ, నజీరుద్దీన్ షేక్, కుశాల్ శర్మ, భరత్ రాజ్, శ్రీ దృతి.

ఈ పోటీదారులు సంగీతం పట్ల వారి అంకితభావాన్ని, అభిరుచిని ప్రదర్శిస్తూ విభిన్న నేపథ్యాలు, అనుభవాలను అందిస్తారు.

గోల్డెన్ మైక్ అందుకున్న పోటీదారులు నేరుగా తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. గోల్డెన్ టికెట్ పొందిన వారు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో చోటు కోసం న్యాయనిర్ణేతల ఆమోదం పొందడానికి మళ్లీ ప్రదర్శన ఇవ్వాలి.

గోల్డెన్ మైక్:

 1. స్కంద
 2. హరిప్రియ
 3. శ్రీ కీర్తి
 4. కేశవ్ రామ్
 5. సాయి వల్లభ
 6. అనిరుధ్ సుస్వరం

గోల్డెన్ టికెట్:

 1. ఎల్ కీర్తన
 2. భరత్ రాజ్
 3. రజనీ శ్రీ పూర్ణిమ
 4. నజీరుద్దీన్ షేక్
 5. ఖుషాల్ శర్మ
 6. శ్రీ ధృతి

‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ‘ఆహా’లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతోంది.