ఒకే రోజు మూడు సినిమాలు రీలీజ్

టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్‌లకి సంబంధించిన వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. గత కొద్దిరోజులుగా వరుసగా సినిమా రిలీజ్ డేట్‌లను మేకర్స్ ప్రకటిస్తున్నారు. దీంతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద హీరోల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతోందని అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. నితిన్ హీరోగా రానున్న చెక్ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుండగా.. అదే రోజు తమిళ హీరో విశాల్ నటించిన చక్ర సినిమాతో కూడా తెలుగులో విడుదల కాబోతోంది.

nitin check movie

అలాగే కన్నడ స్టార్ హీరో ధృవ సార్జా నటించిన పొగరు సినిమా కూడా తెలుగులో ఫిబ్రవరి 19న విడుదల కాబోతోంది. విశాల్, ధృవ సర్జాకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలతో నితిన్ పోటీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది భీష్మ సినిమాతో నితిన్ సూపర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఏడాది కూడా చెక్ సినిమాతో బోణీ కొట్టాలని చూస్తున్నాడు.