‘సారంగపాణి జాతకం’ నుంచి థీమ్ సాంగ్ విడుదల

మల్లేశం, బలగం, 35, కోర్ట్ … ఇలా వరుస విజయాలతో ప్రియదర్శి దూసుకుపోతోన్నారు. ప్రియదర్శి హీరోగా, రూపా కొడవయూర్ హీరోయిన్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. బుధవారం నాడు టీం అంతా కూడా విజయవాడలో సందడి చేసింది. ‘సారంగపాణి జాతకం’ టీం దుర్గమ్మని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకుంది. రేపు వైజాగ్ లో హంగామా చేయబోతున్నారు. వైజాగ్ లో ప్రీమియర్ షో కూడా ప్లాన్ చేశారు.
ఇక ఇదే ఊపులో ‘సారంగపాణి జాతకం’ నుంచి స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీ కథ ఏంటో చెప్పేలా సాగే ఈ ‘సారంగపాణి జాతకం’ థీమ్ పాట ప్రస్తుతం శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

ఈ ‘సారంగపాణి జాతకం’ థీమ్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్‌కు రామ్ మిర్యాల గాత్రం మరింత ఆకర్షణగా నిలిచింది. ‘సారంగపాణి జాతకం’ సినిమా ఎలా ఉంటుందో ఈ ఒక్క పాటలోనే చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాటతో సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ కలగేజేసే ప్రయత్నం చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘సారంగపాణి జాతకం’ ఆడియో మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ‘సారంగపాణి జాతకం’ టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఈ చిత్రం ఉండబోతోందని అర్థం అవుతోంది. ప్రియదర్శితో పాటుగా ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, నరేష్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష వంటి వారంతా నవ్వించబోతోన్నారు. ఈ సినిమాలో ప్రియదర్శికి జంటగా రూప కొడువయూర్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

నటీనటులు : ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీదేవీ మూవీస్
నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకుడు : మోహనకృష్ణ ఇంద్రగంటి
సంగీత దర్శకుడు : వివేక్ సాగర్
కెమెరామెన్ : పీజీ విందా
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్