‘తెలుసు కదా’ హోలీ స్పెషల్ పోస్టర్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ అప్ కమింగ్ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎమోషన్స్, కలర్స్, లైఫ్ సెలబ్రేషన్ గా ఉంటుందని హామీ ఇస్తోంది.

హోలీ సందర్భంగా, పండుగ సారాంశాన్ని పర్ఫెక్ట్ గా చూపించే స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సిద్దు, రాశి, శ్రీనిధి అందరూ కలిసి పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ కలర్ ఫుల్ గా కనిపించారు. సిద్దూ సాంప్రదాయ కుర్తా ధరించి కనిపించగా, రాశి, శ్రీనిధి చీరలలో చక్కదనం జోడించారు. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. తెలుసు కదా కూడా పండుగలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ఈ విజువల్ ప్రామిస్ చేస్తోంది. 

ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పని చేస్తున్నారు. శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు.

‘తెలుసు కదా’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష

రచన, దర్శకత్వం: నీరజ కోన

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సంగీతం: థమన్ ఎస్

డీవోపీ: జ్ఞాన శేఖర్ బాబా

ఎడిటర్: నవీన్ నూలి

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ

పీఆర్వో: వంశీ-శేఖర్