Telangana: తెలంగాణలో థియేట‌ర్లు బంద్‌.. మంత్రి త‌ల‌సాని స్పంద‌న‌!

Telangana: కరోనా వైర‌స్ మ‌ళ్లీ భార‌త్‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. క‌రోనా కేసులు మ‌రోసారి పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ చేయాల‌ని ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆలోచిస్తున్నాయి.. ఇక తెలంగాణ విష‌యానికొస్తే.. ఇక్క‌డ కూడా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌లు బంద్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సినీ థియేట‌ర్ల‌ను కూడా బంద్ చేస్తార‌ని రూమ‌ర్స్ వ‌స్తున్నాయి.. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంపై తెలంగాణ సినిమాటోగ్రాఫ‌ర్ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ స్పందించారు.

telangana

Telangana తెలంగాణ‌లో థియేట‌ర్లు బంద్ చేస్తార‌న్న ప్ర‌చారంలో నిజం లేద‌ని స్ప‌ష్టం చేశారు. సినిమా థియేట‌ర్లు య‌థా విధిగా కొనసాగుతాయ‌ని.. సినీ ప‌రిశ్ర‌మ‌పై కొన్ని వేల కుటుంబాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని.. ఇలాంటి రూమ‌ర్స్‌పై భ‌య‌ప‌డ‌కండ‌ని టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు సూచించారు. అంద‌రి ప్ర‌యోజ‌నాల‌ను, ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. కానీ Telangana థియేట‌ర్ల య‌జ‌మానులు మాత్రం.. సినిమా హాళ్ల‌లో కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా పూర్తిస్థాయి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.