భారత రహస్యాలు లీక్ చేసిన యూట్యూబర్

హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ‘ట్రావెల్ విత్ జో’ ఛానెల్‌తో ప్రసిద్ధి గాంచింది. లక్షల సబ్‌స్క్రైబర్లతో ఆమె ట్రావెల్ వీడియోలకు మిలియన్ల వ్యూస్ వస్తాయి. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్ వెళ్లిన ఆమె, భారత సైనిక రహస్యాలను పాక్ అధికారులకు లీక్ చేసి, భారీ డబ్బు తీసుకుంది. పాక్ హైకమిషన్ అధికారి డానిష్ సూచనలతో ఈ గూఢచర్యం జరిగినట్లు తేలింది. ఆమె వీడియోలు పాక్‌కు అనుకూల ప్రచారంగా ఉన్నాయని బయటపడింది. జ్యోతితో పాటు ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు.

అదే హర్యానాలో, ఖల్సా కాలేజీ విద్యార్థి దేవేంద్రసింగ్ పటియాలా ఆర్మీ కంటోన్మెంట్ సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి అందించాడు. ఫేస్‌బుక్‌లో పిస్టల్ ఫోటోలు పోస్ట్ చేయడంతో అనుమానం రాగా, విచారణలో దేశద్రోహం బయటపడింది. అతన్ని అరెస్ట్ చేసి, ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.

యూపీలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెకానిక్ ర [వీటిని] హనీట్రాప్‌లో చిక్కి, గగన్‌యాన్ ప్రాజెక్ట్ వివరాలను పాక్‌కు లీక్ చేశాడు. రవీంద్రకుమార్‌ను అరెస్ట్ చేశారు.
డబ్బు ఆశతో యూట్యూబర్, విద్యార్థి, ఉద్యోగి దేశద్రోహానికి పాల్పడటం దారుణమని, వీరికి కఠిన శిక్షలు విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.