అక్కినేని వారసుడి కష్టాలు కొత్తగా ఉన్నాయి…

అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా NC19 చిత్ర యూనిట్, ది వరల్డ్ ఆఫ్ NC19 అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కూల్ గా మంచి మ్యూజిక్ తో స్టార్ట్ అయిన ఈ వీడియోలో నాగ చైతన్య ఒక సామాన్యుడిలా కనిపించాడు. ఒక మాములు కుర్రాడిగా, ఇల్లు ఊడుస్తూ, డబ్బులు దాపెట్టుకుంటూ… ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాడో అలా కనిపించాడు. ఇంతకీ నాగ చైతన్య ఇన్ని కష్టాల్లో ఉండడం దేనికి? ఆ కష్టానికి ఫలితం ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే శేఖర్ కమ్ములనే అడగాలి.