కె.సురేష్ బాబు హీరో గా “వకాలత్ నామా” షూటింగ్ ఆగస్ట్ 21న ప్రారంభం!!

శ్రీ శివపార్వతి స్టూడియోస్ అధినేత కుళ్లప్ప రెడ్డి దామోదర్ రెడ్డి. మరియు ఊర్వశి ఆర్ట్స్ అధినేత వి.సుధాకర్ బెనర్జీ సంయుక్తంగా నిర్మిస్తున్న “వకాలత్ నామ” మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైరింగ్ స్టార్ కె.సురేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేశారు. స్క్రిప్ట్ వర్క్, ఆర్టిస్ట్ సెలక్షన్, లొకేషన్ సెర్చింగ్ జరుగుతున్న ఈ చిత్రo షూటింగ్ ఆగస్ట్ 21న ప్రారంభం కానున్నదని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు.

“వకాలత్ నామా” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గ్రిప్పింగ్ గా తీయబోతున్నారు దర్శకులు మురళి బోడపాటి, కథ కథనాలు బాగా రావడంతో ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తామని .. నిర్మాతలు కుళ్లప రెడ్డి దామోదర్ రెడ్డి, వి.సుధాకర్ బెనర్జీ తెలిపారు.