నాని “ట‌క్‌జ‌గ‌దీశ్” రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

న్యాచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ట‌క్ జ‌గ‌దీష్‌. ఇదివ‌ర‌కు వీరిద్ద‌రు క‌లిసి చేసిన చిత్రం నిన్నుకోరి హిట్ మూవీగా నిలిచింది. తాజాగా శ‌నివారం ట‌క్ ‌జ‌గ‌దీష్‌ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న‌ట్టు చిత్ర‌బృందం తెలిపింది. ఈ సంద‌ర్భంగా విడుదల చేసిన పోస్ట‌ర్‌లో స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా నానిని పెళ్లికొడుకును చేస్తున్నట్టు క‌నిపిస్తుంది. అలాగే జ‌గ‌ప‌తిబాబు, న‌రేశ్, నాజ‌ర్‌, రావు ర‌మేశ్‌, రోహిణి వంటి వారు ఈ సినిమాలో న‌టించారు.

nani tak jagadish realese date

ఇక ఈ చిత్రంలో నానికి జోడీగా రీతూవ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేశ్ హీరోయిన్ల్‌గా న‌టిస్తుండ‌గా.. షైన్స్ స్క్రీన్స్ ప‌తాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని స‌మ‌కురుస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కాగానే త‌న త‌దుప‌రి సినిమా శ్యామ్ సింగ రాయ్ స్టార్ట్ చేయ‌బోతున్నారు నాని. ఈ చిత్రాన్ని టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌కత్వంలో స‌త్య‌దేవ్ జంగా అందించిన పీరియాడిక‌ల్ ఫిక్ష‌న్ క‌థ‌తో ఈ శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, ఉప్పెన ఫేం క్రితి శెట్టి హీరోయిన్ల‌గా న‌టించ‌నున్నారు.