మలుపులు తిరుగుతున్న కన్నడ హీరో దర్శన్ హత్య కేసు

కన్నడ హీరో దర్శన్ ఇటీవలే ఓ హత్య కేసు లో తెరమీదకు వచ్చారు. భార్యను వదిలేసి హీరోయిన్‌తో సహజీవనం చేస్తుండగా ఆ విషయం అడిగిన అభిమానిని హత్యా చేసినట్లు సమాచారం. ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి.

హీరో దర్శన్‌కు విజయలక్ష్మి అనే మహిళతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది. అయితే అతడు భార్యకు దూరంగా ఉంటూ పవిత్ర గౌడ అనే కన్నడ హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రేణుక స్వామి అనే ఒక దర్శన్ అభిమాని పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోల మీద అసభ్యంగా కామెంట్ చేసేవాడు. దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్ర కారణమని భావిస్తూ ఆయనని విడిచి పెట్టాలని బూతులతో బెదిరించేవాడు.

అది సహించలేని పవిత్ర గౌడ మరియు దర్శన్ అతనికి వార్నింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి.. దర్శన్ తన అభిమాన సంఘం నాయకుల చేత రేణుక స్వామిని కిడ్నాప్ చేయించి బెంగళూరులోని ఓ గోడౌన్లో చిత్రహింసలు పెట్టి అతడిని చంపి ఓ చెరువులో శవాన్ని పడేశాడు. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఈ హత్యకి దర్శన్ కి సంబంధం ఉన్నటు నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.