కువైట్ పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న “సాల్ట్” చిత్రం అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో మార్చి 17 న విడుదల!!

ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఒక సంఘటనలో చిక్కుకొంటే ఆ అమ్మాయి ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయట పడిందనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా వాస్తవికత వినోదాల మేళవింపుతో కువైట్ పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరించిన చిత్రం “సాల్ట్”. సింక్ ఫ్రేమ్ పతాకంపై అబ్దుల్ ముజీర్, ఖాజా మొయినుద్దీన్, బాబావలి షేక్, హైదర్ షేక్, మస్తాన్ యోయో ప్రధాన పాత్రలుగా మున్నా సయ్యద్ దర్శకత్వంలో వెంకట్ కోడూరు నిర్మించిన సస్పెన్స్, థ్రిల్లర్ మర్డర్, మిస్టరీ చిత్రం “సాల్ట్”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17 న అమెజాన్, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా,యమ్ యక్స్ ప్లేయర్, ఓడాఫోన్ ఐడియా మొదలగు అన్ని ఓ.టి.టి ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర దర్శక,నిర్మాతలు కవైట్ లో ఉన్నందున వారి ప్రతినిధిగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్స్క్యుటివ్ కమిటీ మెంబెర్ డాక్టర్ పద్మిని నాగులపల్లి ఆద్వర్యంలో హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఘర్షణ శ్రీనివాస్,దర్శక,నిర్మాత మంజుల సూరజ్, నిర్మాత యమ్ ఆర్.సి చౌదరి, దర్శకుడు నల్లపూసల బాబ్జి, దర్శక,నిర్మాత వెంకటప్పరావు, అమెజాన్ రాజీవ్, రావిపల్లి రాంబాబు,చరణ్ నటుడు, నిర్మాత సురేష్ తదితరులు పాల్గొని చిత్ర ట్రైలర్స్,పోస్టర్స్ లను విడుదల చేశారు. అనంతరం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్స్క్యుటివ్ కమిటీ మెంబెర్ డాక్టర్ పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ ..”సాల్ట్” మూవీ మొత్తం కువైట్ లోనే చిత్రీకరించడం జరిగింది.కవైట్ లో ఉన్న తెలుగు వారందరూ కలసి రూపొందిన సస్పెన్స్, థ్రిల్లర్ “సాల్ట్”. ఈ చిత్రం ప్రి లాంచ్ ఇక్కడ జరుపు కుంటున్నాము. దర్శక, నిర్మాతలు ఇక్కడ లేకపోయినా వారు తీసిన సినిమాకు మేమున్నాం అంటూ ఇక్కడున్న దర్శక నిర్మాతలు సపోర్ట్ గా నిలిచారు వారికి నా ధన్యవాదాలు.ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ముఖ్య కారణం దర్శక,నిర్మాత వెంకటప్పరావు, ప్రభంజన్ గార్లే.