సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సెట్స్ నుండి ఫోటో షేర్ చేసిన మేకర్స్

తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రాబోతున్న సినిమా సికందర్. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న సల్మాన్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

సికందర్ సినిమా మొదలైనప్పటి నుండి ఈ సినిమా న్యూస్ హెడ్ లైన్స్‌లో ఉంటూనే ఉంది. అంతే కాకుండా ఆ సినిమా మేకర్స్ ప్రేక్షాకులలో ఆ సినిమా బజ్ ఉండేలా ఎప్పటికప్పుడు ఆ సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అదే తరహాలో ఈ సినిమా సెట్స్ నుండి మేకర్స్ ఒక ఫోటో విడుదల చేసారు. ఆ ఫోటోను చూసిన సల్మాన్ అభిమానులు సినిమా పై మరింత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు.

మాకెర్స్ ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లిమ్ప్స్ విడుదల చేసారు. ఆ గ్లిమ్ప్స్ యెక్క చిత్రంలో సికందర్ పోస్టర్‌తో పాటు బ్రేస్లెట్ కనిపిస్తుంది. అది చూసిన ప్రేక్షకులు సల్మాన్ ఖాన్ సికందర్ పై మరిన్ని అంచనాలు పెట్టుకోగా ఇప్పుడు సెట్స్ నుండి మేకర్స్ ఒక యాక్షన్ సీక్వెన్స్‌కు సంబందించిన ఫోటో  విడుదల చేయడం జరిగింది.

https://www.instagram.com/p/C8v2m3mSwUV/?utm_source=ig_web_copy_link