‘జాక్’ ప్రమోషన్స్ లో భీమవరంలో చిత్ర బృందం

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు  పెంచేశాయి. ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు భీమవరంలోని విష్ణు కాలేజీలో చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ క్రమంలో..

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. ‘భీమవరం వచ్చి ఇలా మీ (స్టూడెంట్స్) అందరినీ కలవడం ఆనందంగా ఉంది. కాలేజ్ లైఫ్ ఎంతో అందంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ ఈ టైం మళ్లీ రాదు. ఎంజాయ్ చేయండి. స్టూడెంట్ ఎనర్జీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. విష్ణు కాలేజ్‌లో ఈవెంట్ చేయడం సంతోషంగా ఉంది. ఏప్రిల్ 10న జాక్ చిత్రం రాబోతోంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ .. ‘నాకు కాలేజ్ లైఫ్ అంటే చాలా ఇష్టం. మీ అందరిలా ఇలా ఈవెంట్లు, ఫెస్ట్‌లో వచ్చి ఎంజాయ్ చేయాలని ఉండేది. ఏప్రిల్ 10న మా జాక్ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. చాలా ఫన్‌గా, ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. మీ అందరికీ మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. సిద్దుతో నటించడం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చింది. చాలా టాలెంటెడ్ పర్సన్. జాక్ టీంతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘సిద్దు జొన్నలగడ్డ ఆల్ రౌండర్. కానీ ఇప్పుడు ఇక్కడి విద్యార్థులు డైరెక్షన్ చేయమని కోరుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇలా సినిమాలు తీయనివ్వండి. జాక్ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 11న ఈ సినిమా రానుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.