పవన్ కళ్యాణ్ కోసం కదిలి వచ్చిన కుటుంబం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ కూటమిలో భాగంగా పిఠాపురం నియోజక వర్గం నుండి ఎంఎల్ఏ గా గెలుపొందారు. ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ గన్నవరం దగ్గర కేసరి పల్లిలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్ర బాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి స్థాయి గెస్ట్ గా, అలాగే రామ్ చరణ్ గారికి ఆహ్వానం అందిన విష్యం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడటానికి గాను తన కుటుంబం అంతా కలిసి హైదరాబాద్ నుండి ఓ బస్సు లో ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని తాము స్వయంగా చూడటం కోసం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్, కూతురు ఆధ్య తో పాటు కుటుంబం అంత వచ్చారు.

https://www.instagram.com/p/C8Gnhsqvoko/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==