ది ఫ్యామిలీ మ్యాన్ 2: ఎపిసోడ్ 6 రివ్యూ

Episode 6: Martyrs: జబరాజ్ ని చంపి ఆయుధాలతో రాజి సాజిద్ తిరిగి రావడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. జబరాజ్ ని రాజీ చంపేయడంతో అతని ఇంట్లో ఉన్న తనకి కావాల్సిన ఒక వస్తువు కోసం జబరాజ్ ఇంటికి వెళ్తుంది. ఇదే సమయంలో శ్రీకాంత్ కూడా లోకల్ 52ని డీకోడ్ చేసి జబరాజ్ ఇంటికి టీంతో సహా వస్తాడు. ఇక్కడ జరిగిన ఫైట్ లో రాజీ శ్రీకాంత్ కి దొరికిపోతుంది. సాజిద్ అండ్ సెల్వలు అక్కడి నుంచి తప్పించుకోని వెళ్ళిపోతారు. రాజీని పుట్టుకొచ్చిన టాస్క్ ని ఆమెతో నిజం చెప్పించాలని చూస్తారు కానీ రాజీ తన గతం చెప్పి… తనని చంపినా కూడా ఒక్క ముక్క మాట్లాడానని తేల్చి చెప్పేస్తుంది. సాజిద్ రాజీని విడిపించడానికి టాస్క్ ఆఫీస్ పై అటాక్ చేస్తాడు. ఈ ఫైరింగ్ లో టాస్క్ ఆఫీసర్ మిలింద్ చనిపోతాడు. సాజిద్ సక్సస్ ఫుల్ గా రాజీని తప్పించుకోని తీసుకోని వెళ్తాడు కానీ ఈ ఫైరింగ్ టైములో రాజీకి బుల్లెట్ తగిలి గాయం అవ్వడంతో ఆమె సివియర్ గా ఇంజ్యుర్ అయ్యింది. తన ప్రతి పనికి శ్రీకాంత్ అడ్డు వస్తున్నాడని భావించిన సాజిద్.. ఎప్పటినుంచో ఫాలోఅప్ చేస్తున్న శ్రీకాంత్ కూతురు దృతిని ప్రేమించిన కళ్యాణ్ తోనే కిడ్నప్ చేయించడానికి ప్లాన్ చేస్తాడు. కళ్యాణ్ ప్రేమ ధృతిని ట్రాప్ చేయడానికి వేసిన ప్లాన్ అని అర్ధం అవుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 6 అయిపొయింది.

టాకీ పార్ట్ తక్కువ యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉన్న ఎపిసోడ్ ఇది. రెండు ఫైట్స్ ఈ ఎపిసోడ్ లో మంచి థ్రిల్ ఇస్తాయి.