ది ఫ్యామిలీ మ్యాన్ 2: ఎపిసోడ్ 5 రివ్యూ

Episode 5: Home Coming: ఎపిసోడ్ 5 శ్రీకాంత్, జేకేలని స్టేషన్ లో పెట్టడంతో మొదలవుతుంది. ఉమాయల్ టాస్క్ ఆఫీసర్స్ అని చెప్పినా వారిని నమ్మదు. చివరికి తమిళనాడు టాస్క్ టీం హెడ్ వచ్చి శ్రీకాంత్ ని విడిపించాల్సి వస్తుంది. ఈ సమయంలోనే జేకే ఉమాయల్ కి ఇంప్రెస్ అవుతాడు. టిగ్రిస్ చేరిన రాజీ ప్లేన్ ని పూర్తిగా రెడీ చేస్తుంది.

ముంబైలో ఆనంద్ కంపెనీలో జాయిన్ అయిన సూచీ… తన వర్క్ తాను హ్యాపీగా చేసుకుంటూ ఉంటుంది. ఆనంద్ కి సూచి మీద ఉన్న ఇష్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ సూచి మాత్రం రిజక్ట్ చేస్తుంది.

లండన్ లోని దీపన్ కి ఇండియన్ ఆఫీసర్స్ ఫోన్ చేసి భాస్కరన్ చేయాలనుకుంటున్న అటాక్ గురించి చెప్పి, ఏమైనా చేయరానిది చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తాడు. ఇది విని ఆశ్చర్యపోయిన దీపన్, భాస్కరన్ ని కలిసి ఎలాంటి అవాంఛనీయ పనులు చెయ్యొద్దు అంటాడు. అయితే చనిపోయింది తన తమ్ముడు కాబట్టి తాను బదులు తీర్చుకుంటాను అని భాస్కరన్ తెగేసి చెప్తాడు. దీంతో దీపన్ అక్కడి నుంచి వచ్చేసి భాస్కరన్ ని గమనించడానికి కొందరు మనుషులని ఇంటి బయట పెడతాడు.

కొన్ని ఆయుధాల కోసం సాజిద్ తో కలిసి తమిళ రెబల్స్ బేస్ అయిన వీరారణ్యంకి వెళ్తుంది. ఈ సమయంలో వాళ్ళకి లోకల్ 52 అనే వ్యక్తి హెల్ప్ చేస్తాడు. రాజీ గురించి ఎంక్వయిరీ చేయడంలో టాస్క్ కి ఉమాయల్ కూడా కలవడంతో స్పీడ్ గానే రాజీని ట్రేస్ అవుట్ చేస్తారు. శ్రీకాంత్ అండ్ టీం వీరారణ్యం అంటే ఒక ఊరి పేరు అని లోకల్ 52 అనేది జబరాజ్ అనే లోకల్ స్మగ్లర్ కోడ్ నేమ్ అని తెలుసుకుంటారు. శ్రీకాంత్ జబరాజ్ గురించి వెతుకుతూ ఉంటాడు. రాజీ సాజిద్ లు మాత్రం జబరాజ్ తో వీరారణ్యం వెళ్లి అక్కడ వెపన్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఈ వీరారణ్యంకి వెళ్లే సమయంలోనే రాజీ ట్రైలర్ లో చూపించిన ఎల్లారియుమ్ సాకోళ్లనుమ్ అనే ఫేమస్ డైలాగ్ చెప్తుంది. ఆయుధాలు కలెక్ట్ చేసుకుంటూ ఉండగా జబరాజ్ తాగి గొడవ చేస్తూ ఉండడంతో కోస్ట్ గార్డ్స్ వస్తారు, రాజీ సాజిద్ వాళ్లతో పాటు జబరాజ్ ని కూడా చంపేసి ఆయుధాలని కలెక్ట్ చేసుకుంటారు.

సమీర్ కి ఇండియా భాస్కరన్ ని గమనిస్తుంది అనే విషయం తెలుస్తుంది. దీంతో అతను భాస్కరన్ ని ఆ ఇంటి నుంచి అండర్ గ్రౌండ్ పంపిస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ 5 ముగుస్తుంది. నిజం చెప్పాలి అంటే ఈ ఎపిసోడ్ వల్ల సిరీస్ కి ఎలాంటి యూస్ లేదు. ఇంపార్టెంట్ సీన్స్ కానీ టర్నింగ్ పాయింట్స్ కానీ ఎగ్జైట్మెంట్ కలిగించే సీన్ కానీ ఈ ఎపిసోడ్ లో లేదు. పోనీ పోలీస్ ఎంక్వయిరీ అన్నా ఉందిలే అనుకుంటే అది నిజంగా కథకి అవసరం లేనిదే. ఎందుకంటే, రాజీకి బాంబ్ పీల్చడానికి అవసరమైన జబరాజ్ ఇంట్లో ఉంది అనే విషయం తెలుసు నెక్స్ట్ ఎపిసోడ్ తను అక్కడికి నేరుగా వెళ్తుంది కూడా. జబరాజ్ ఇంటికి రాజీ వెళ్లడానికి ఇంత క్రియేట్ చేయాలా అని ఆలోచిస్తే ఈ ఎపిసోడ్ లేకపోయినా సిరీస్ కి వచ్చే నష్టం ఏమీ కనిపించలేదు.