నిజజీవిత సంఘటనలు ఆధారంగా ‘ది బర్త్ డే బాయ్’ టీజర్

ఈ మధ్య కాలంలో వస్తావా సంఘటనల మీద సినిమాలు చాలానే వాడ్తున్నాయి. మరి కొన్ని సినిమాలు చూసుకుంటే వాస్తవ సంఘటనల ఆధారంగా మరి కొన్ని కల్పితాలతో సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో సినిమా మన ముందుకు రాబోతుంది. ‘ది బర్త్ డే బాయ్’ అనే టైటిల్ తో రవి కృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్ మల్ల ముఖ్య పాత్రలలో మన ముందుకు రాబోతుంది. విస్కీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా టీజర్ తాజాగా మేకర్స్ విడుదల చేయడం జరిగింది. ప్రశాంత్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా సంకిర్త్ రాహుల్ సినెమాటోగ్రఫేర్గా పని చేశారు. బొమ్మ బొరుసా బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు భరత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసారు.

ఇక టీజర్ విషయానికి వస్తే బర్త్ డే రోజు జరిగే కొన్ని ఫన్నీ సంఘటనల మధ్య జరిగే పరిస్థుతలను మనం చూడొచ్చు. అయితే ఆరోజు జరిగిన సంఘటనతో ఎం జరుగుతుంది అనేలా ఉంది. ఇక టీజర్లో చూపించిన సంఘటన అంతా ఒక్క రాత్రిలో జరిగినట్లు అర్ధం అవుతుంది.