నూజివీడు టాకీస్ నుంచి రేఖ పలగాని సమర్పణలో వస్తున్న చిత్రం ఐరావతం.ఈ సినిమాలోని “ఓ నా దేవేరి” లిరికల్ వీడియో ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా రిలీజ్ అయినందుకు ఆరోజు గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామ్ మిర్యాల పాడిన ఈ పాట రిలీజైన మొదటి ఇరవై నాలుగు గంటల్లో మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే ఇంతకు ముందే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చినట్టు తెలిపారు.
ఈ ఈవెంట్ లో బిగ్ బాస్ 5 టీమ్ లో సభ్యులైన నటరాజ్ మాస్టర్, లోబో, మానస్, కాజల్ మరియు ప్రణీత్ యాంటీలియా మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ గారు కలిసి ‘నా దేవేరి’ పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది.
హీరో,హీరోయిన్ పాత్రలలో నటించిన అమర్ దీప్,తన్వీ లు మాట్లాడుతూ.. ఒక సరికొత్త కథ లో నటించినందుకు ఆనందం వ్యక్తపరిచారు. నిర్మాతలైన రాంకీ సల్లగాని, లలితకుమారి, తోట బాలయ్య చౌదరి చల్లా మాట్లాడుతూ కథలోని న్యూ వేవ్ ట్రీట్మెంట్ మూవీ తీయడానికి ప్రేరేపించిందని ,ఇటువంటి కొత్త కథలు చెప్తే ప్రేక్షకులు ఖచ్చితంగా తమని దీవిస్తారని ఈ సినిమా షూట్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉందని చెప్పారు.
దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ.. “ఓ నా దేవేరి” పాటని టూ మెలోడియస్ గా కంపోజింగ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కి, అడగగానే పాడి ఆ పాటకు ప్రాణాన్ని పోసిన రామ్ మిరియాల కి కృతజ్ఞతలు తెలిపారు.ఐరావతం లో ఉన్న ప్రముఖ పాత్రల్లో “ఐరావతం” అనే ముఖ్య పాత్ర ఎవరిది !? మరియు వైట్ కలర్ లో ఉన్న కెమెరా ని క్లిక్ చేస్తే జరిగే మ్యాజిక్ ఏంటనేది మూవీ చూస్తేనే తెలుస్తుంది అని
తెలిపారు. ఈ వైట్ కెమెరా హీరోయిన్ చేతుల్లోకి వచ్చాక ఆమె పడిన ఇబ్బందులు ఏమిటి అనేదీ చాలా యంగేజింగ్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే అని సినిమా చూస్తే తెలుస్తోంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సత్య మాట్లాడుతూ.. తన పైన నమ్మకం ఉంచి పాట కంపోజింగ్ అయ్యే వరకు తనని నమ్మి, అన్నివిధాలా సహకరించి ఒక మంచి పాట ఆడియన్స్ కి అందించేలా సహకరించిన నిర్మాతలకి దర్శకుడికి తను కృతజ్ఞుడినై ఉంటానన్నారు. ఇటువంటి యునీక్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వడం తన లక్ అని అన్నారు.
నటీనటులు
హీరో: అమర్దీప్, హీరోయిన్: తన్వి, 2వ హీరో: అరుణ్, 2వ హీరోయిన్: ఎస్తేర్, కామెడీ: సప్తగిరి హీరో తల్లి: జయవాణి, SI : సంజయ్ నాయర్, హెడ్ కానిస్టేబుల్: రవీంద్ర,
టెక్నిషియన్స్
సమర్పణ : రేఖ పలగాని
నిర్మాతలు: రాంకి పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరి చల్లా
దర్శకుడు: సుహాస్ మీరా
డిఒపీ: Rk వల్లెపు
సంగీతం: సత్య కశ్యప్
ఎడిటర్: సురేష్ దుర్గం
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్
డిజిటల్ : మనోజ్
పోస్టర్లు: ధని ఎల్