ట్రైలర్ బాగుంది… ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ నిర్మాతగా మరి చేస్తున్న ఫస్ట్ సినిమా మీకు మాత్రమే చెప్తా. తనని హీరోని చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి విజయ్ చేసిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సినిమాకి కావాల్సిన హైప్ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో విడుదల చేయించిన మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ చాలా ఫన్నీ అండ్ రియలిస్టిక్ గా ఉంది. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన ట్రైలర్, సెల్ ఫోన్ మన జీవితంలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్తూ కట్ చేశారు.

రోజూ ఆరు గంటల పాటు ఫోన్ లో వీడియోలు చూసి టైంపాస్ చేసే మనం, అందులో ఒక వీడియో మనదే అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ కొత్తగా ఉంది. మన ప్రైవసీని దెబ్బతీస్తూ పర్సనల్ వీడియో బయటకి వస్తే, అది అందరూ చూస్తే పరిస్థితి ఏంటి? అనే థాట్ చాలా కొత్తగా ఉంది. నిజానికి సెల్ ఫోన్ వల్ల మనం ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లెమ్ చాలా సీరియస్ ఇష్యూ. ఇలాంటి పాయింట్ ని తీసుకోని, దాని చుట్టూ ఫన్నీగా కథని అల్లుకోవడంలోనే శామీర్ ఫస్ట్ సక్సస్ అయ్యాడు. మంచి కథకి, తరుణ్ లాంటి ఫన్ టచ్ ఇవ్వగల డైరెక్టర్ కలవడంతో మెయిన్ పాయింట్ ఇంకా ఎలివేట్ అయ్యింది. ట్రైలర్ లో ఫన్ ఉన్నా కూడా సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో సెల్ ఫోన్ ఎఫెక్ట్ అండ్ ఆ వీడియో గురించి సీరియస్ గానే డిస్కస్ చేసినట్లు అనిపిస్తోంది. మొదటిసారి హీరోగా చేసిన తరుణ్ భాస్కర్ లుక్ బాగుంది, ముఖ్యంగా ట్రైలర్ లో వచ్చిన ఒక రొమాంటిక్ బిట్ లో గొడుగు పట్టుకున్న సీన్ లో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరూ కలర్ఫుల్ గా కనిపించారు. ట్రైలర్ ఎండ్ లో స్కిప్ బటన్ గురించి తరుణ్ భాస్కర్ డైలాగ్ చెప్తుంటే విజయ్ దేవరకొండ వినిపిస్తుండడం విశేషం. శివకుమార్ ఇచ్చిన మ్యూజిక్ ట్రైలర్ కి బాగా హెల్ప్ అయ్యింది. మొత్తానికి టీజర్, ట్రైలర్ తో మెప్పించిన మీకు మాత్రమే చెప్తా… మిస్ అయిన ఆ తరుణ్ వీడియో ఏంటి? అది బయటకి వచ్చిందా? రెండు రోజుల్లో జరగాల్సిన హీరో పెళ్లికి ఆ వీడియో కారణంగా ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చిందా లాంటి ప్రశ్నలకి త్వరలోనే ప్రేక్షకులకి చెప్పనున్నారు.