Bharani: ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ప‌ద్మ‌విభూష‌ణ్‌పై త‌నికెళ్ల‌భ‌ర‌ణి స్పంద‌న‌..

Bharani: గాన గంధ‌ర్వుడు దివంగ‌త ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యానికి ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 2021 సంవ‌త్స‌రానికి గానూ మొత్తం ఏడుగురికి ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించ‌గా.. దాదాపు దేశంలోని అన్ని భాష‌ల్లోనూ ఎస్పీ బాలు పాట‌లు పాడారు.. ఈ విధంగా క‌ళారంగానికి ఆయ‌న చేసిన విశేష సేవ‌కు గుర్తింపుగా ఈ అవార్డును కేంద్రం ప్ర‌క‌టించింది.

Bharani sp balu

Bharaniఈ విష‌యంపై స్పందించిన న‌టుడు, ర‌చ‌యిత త‌నికెళ్లభ‌ర‌ణి.. హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ సింగ‌ర్ మీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. బాలుగారికి ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు రావ‌డం ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బాలు గారితో మిథునం చిత్రం రూపొందించ‌డం.. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తీసుకురావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు Bharani. కానీ ఈ క్ర‌మంలో బాలుగారు లేనిలోటు కల‌త ఉన్నా ఆయ‌నకు ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల ఎంతో ఆనందంగా ఉంద‌ని, బాలుగారితో ఉన్న అనుబంధాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌న్నారు. Bharaniఅలాగే క‌రోనా వైర‌స్‌పై మాట్లాడుతూ.. ప్ర‌పంచ‌మంతా నాదే అనుకున్నావాళ్ల‌కు ఇది చెంప‌పెట్టు ఈ క‌రోనా అని ఆయ‌న అన్నారు. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యాన్ని కాపాడ‌క‌పోతే త్వ‌ర‌లోనే ప్ర‌పంచ వినాశ‌నం త‌ప్ప‌ద‌నే స‌త్యాన్ని క‌రోనా నేర్పింద‌న్నారు Bharani త‌నికెళ్ల‌భ‌ర‌ణి. ఇక సింగ‌ర్ మీట్ కార్య‌క్ర‌మానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని ప‌లు ప్రాంతాల నుంచి దాదాపు 50మంది గాయ‌నీ గాయ‌కులు పాల్గొని.. మ‌ధురమైన గీతాలాప‌న‌లు చేశారు.