Thala Ajith: రీఎంట్రీ ఇస్తున్న తాలా అజిత్ స‌తీమ‌ణీ..

Thala Ajith: త‌మిళ స్టార్ తాలా అజిత్ స‌తీమ‌ణి షాలినీ మ‌ళ్లీ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. మాధ‌వ‌న్ న‌టించిన స‌ఖీ సినిమాతో షాలినీ సినీ ప్రేక్ష‌కుల్ని ఎంతో మెప్పించింది. అనంత‌రం Thala Ajith తాలా అజిత్‌ను ప్రేమ వివాహం చేసుకుని కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు.. 2001లో తెర‌కెక్కిన ప్రియ‌ద వ‌రం వెండూమ్ సినిమా ఆమెకు చివ‌రి చిత్రం..

ఇప్పుడు తాజాగా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న‌ట్లు కోలీవుడ్ స‌మాచారం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న త‌మిళ చిత్రం పొన్నియిన్ సెల్వ‌న్‌లో ఓ కీల‌క‌పాత్ర కోసం షాలినిను సంప్ర‌దించార‌ని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విష‌యంపై చిత్ర‌బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ఇదిలాఉంటే.. తాలాThala Ajith అజిత్ ప్ర‌స్తుతం వలిమై చిత్రంలో బిజీగా ఉన్నాడు.