Thamannah: త‌మ‌న్నా ముంబైలోని నివాసం చూశారా..

Thamannah: ప్ర‌ముఖ న‌టి త‌మ‌న్నా భాటియా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న‌ది.. శ్రీ చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది త‌మ‌న్నా. మ‌రోవైపు త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారును పిచ్చేక్కిస్తుంది.. ఇంతా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా త‌న హోమ్ టూర్‌తో ఫ్యాన్స్‌‌ను ఫిదా చేసిందిThamannah. ఓ ప్ర‌ముఖ పెయింటింగ్స్ సంస్థ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో భాగంగా ముంబైలోని త‌న విశాల‌మైన నివాసాన్ని త‌మ‌న్నా అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..

thamannh

షూటింగ్స్ కార‌ణంగా తాను ఇంట్లో ఎక్కువ స‌మయాన్ని గ‌డిపే అవ‌కాశంలేద‌ని ఆమె అన్నారు. ఒక‌వేళ ఇంట్లో ఉంటే త‌న పేరెంట్స్‌తో స‌ర‌దాగా మాట్లాడుతూ.. వెరైటీ వెరైటీ స్నాక్స్ తింటూ.. టీ సేవించ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తాన‌ని తెలిపింది త‌మ‌న్నా. సుమార్ 8సంవ‌త్సరాల నుంచి మేము ఇక్క‌డ ఉంటున్నాం.. ఇంటీరియ‌ర్ డిజైన్ల్‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని నాన్నే ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఈ నివాసం నాకు ప్ర‌తిరోజు కొత్త‌గానే ఉంటుంది అని త‌మ‌న్నా వివ‌రించింది. ఇక ఆమె ప్ర‌స్తుతం సీటీమార్‌, ఎఫ్‌-3 చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే నితిన్ న‌టిస్తున్న అంధాధున్ రీమేక్ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుందిThamannah.. ఇందులో హాట్ బ్యూటీ న‌భా నటేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.. ఈ చిత్రం జూన్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.