Thamanna: సీటీమార్‌లో ఆ పాత్ర‌ను నేనెంతో ఆస్వాదించాను: త‌మ‌న్నా

Thamanna: యాక్ష‌న్ హీరో గోపీచంద్‌, త‌మ‌న్నాభాటియా ప్ర‌ధాన పాత్ర‌లుగా సీటీమార్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. శ్రీ‌నివాసా సిల్వ‌ర్ స్ర్ర్కీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హిళ‌లా క‌బ‌డ్డీ క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా.. ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం. కాగా ఇందులో మ‌హిళా క‌బ‌డ్డీ కోచ్‌గా జ్వాలారెడ్డి పాత్ర‌ల్లో త‌మ‌న్నా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే..

ఇందుకు సంబంధించిన డ‌బ్బింగ్‌ను ఇటీవ‌లే త‌మ‌న్నాThamanna కంప్లీట్ చేసింది. దీంట్లో స్వ‌యంగా త‌మ‌న్నానే డ‌బ్బింగ్ చెప్పింది.. ఇందులో భాగంగానే తొలిసారి తెలంగాణ యాస‌లో సంభాష‌ణ‌లు ప‌లికింది త‌మ‌న్నా. దీనిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ‌న్నా స్పందిస్తూ.. న‌న్ను న‌మ్మి జ్వాలారెడ్డి పాత్ర ఇచ్చినందుకు డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది కి కృత‌జ్ఞ‌త‌లు.. ఈ చిత్రంలో తెలంగాణ యాస‌ను ప్ర‌య‌త్నించా.. డ‌బ్బింగ్ పూర్త‌యింది.. ఈ పాత్ర‌ను నేనెంతో ఆస్వాదించాన‌ని.. నేను చెప్పిన తెలంగాణ యాస సంభాష‌ణ‌లు తెర‌పై విజిల్స్ ప‌డ‌తాయనే న‌మ్మ‌కం ఉంద‌ని ట్వీట్‌లో రాసుకొచ్చింది త‌మ‌న్నాThamanna.