మెగాస్టార్ లూసిఫర్ కోసం తమన్ స్పెషల్ సాంగ్…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్టర్ గా తెరకెక్కనున్న సినిమా లూసిఫర్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకి ఇది తెలుగు వెర్షన్. పొలిటికల్ డ్రామా తెరకెక్కనున్న ఈ సినిమాకి “చిరు 153” వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వర్క్ చేస్తున్నాడు. ఇటివలే డైరెక్టర్ మోహన్ రాజ, తమన్ ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారు.

గత కొంత కాలంగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తున్న తమన్, చిరు కోసం స్పెషల్ గా ఒక సాంగ్ ని డిజైన్ చేసాడట. తెలుగు లూసిఫర్ కోసం తమన్ లండన్ లోని అబ్బే రోడ్ లో ఫస్ట్ సాంగ్ ని 60 మంది గ్రాండ్ ఫిల్ హర్మోనిక్ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ తమన్ ట్వీట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి మ్యూజిక్ ఇవ్వడం లైఫ్ టైం డ్రీమ్ గా భావించే తమన్, తన కెరీర్ లోనే ఈ ఆల్బమ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. గతంలో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో చిరు గెస్ట్ రోల్ ప్లే చేస్తే… దానికి తమన్ చిరు ఎంట్రీ టైంలో అదిరిపోయే బీజీఎమ్ ఇచ్చాడు. ఇప్పటికి మెగాస్టార్ ఎంట్రీకి బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే లిస్టు తీస్తే బ్రూస్ లీ బీజీఎం పక్క ఆ లిస్టు లో టాప్ 5 లో ఉంటుంది. జస్ట్ గెస్ట్ రోల్ లో అలాంటి మ్యూజిక్ ఇచ్చిన తమన్ లూసిఫర్ ఫుల్ మూవీ ఎలాంటి సెన్సేషనల్ మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.