రజినీ వారసుడు కొత్త దళపతి వచ్చేశాడు… ఇది రికార్డుల వేట

సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో ఎవరు అనే మాటకి అప్పుడప్పుడూ రెండు మూడు పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే బిగిల్ సినిమాతో విజయ్ ఆ క్వేషన్ కి సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన కమర్షియల్ మూవీ బిగిల్. విజయ్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన ఈ బిగిల్ సినిమా మూడు వారాల్లోనే మూడు వందల కోట్ల వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. తెలుగు తమిళ్ లో మాత్రమే రిలీజ్ కి ఈ సినిమా ఇంత రాబట్టగలదా అని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నారు.

నిజానికి రజినీకాంత్ కి మాత్రమే ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టే సత్తా ఉంది. ఫ్లాప్ సినిమాలతో కూడా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం రజినీ స్టామినా. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు, ఈ తర్వాత ఎవరు అనే మాట వినిపిస్తూనే ఉంది, ఇప్పుడు విజయ్ వరసగా 200 కోట్లు రాబట్టాడు అది కూడా హ్యాట్రిక్ టైమ్స్. సర్కార్, మెర్సెల్ సినిమాలతో 200 కోట్లు వసూళ్లు చేసిన విజయ్, ఇప్పుడు ఏకంగా 300 కోట్లు రాబట్టాడు. నిజానికి బిగిల్ పెద్ద కళాఖండం ఏమీ కాదు, సినిమాపై ఉన్న హైప్… విజయ్ అట్లీ కాంబినేషన్ కలిసి మూవీని హ్యుజ్ కమర్షియల్ సక్సస్ చేశాయి. తుపాకీ నుంచి మొదలైన ఈ వసూళ్ల వేట, కాన్స్టాంట్ గా హిట్స్ కొడుతూ గత మూడు నాలుగేళ్లుగా పీక్ స్టేజ్ కి చేరింది. ఇంత కన్సిస్టెంట్ గా బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు అందుకే విజయ్ ని తమిళనట ఇళయదళపతి అంటారు, అంటే తెలుగులో కొత్త దళపతి అని అర్ధం. లాస్ట్ మూడు మూవీస్ తో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు కాబట్టి కొత్త అనే పేరు తీసేసి అతన్ని ఏకంగా దళపతినే చేశారు. మరి ఈ దళపతి రాబోయే రోజుల్లో ఎలాంటి హిట్స్ ఇస్తాడు అనేది చూడాలి.